‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది: హీరో శ్రీకాంత్

by Chukka Sudharani |

బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘దేవగుడి’.

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది: హీరో శ్రీకాంత్
X

దిశ, సినిమా: బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘దేవగుడి’. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌‌ను సీనియర్ హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘2013లో రామకృష్ణా రెడ్డి నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎంతో ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా సినిమాలు నిర్మించి సక్సెస్ అయ్యారు. అప్పట్లో ఆయన సినిమా గురించి చెబుతుంటే.. మీరే డైరెక్షన్ చేయవచ్చు కదా అని అనేవాడిని. మరి నేను అప్పుడు అలా అన్నాననో, లేకపోతే.. ఫస్ట్ ఫిల్మ్ దగ్గరుండి అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ, వెంటనే డైరెక్టర్‌గా మారారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ ‘దేవగుడి’ చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ‘దేవగుడి’ టైటిల్ చాలా బాగుంది. టీజర్ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో చిత్రమ్మ పాడిన మెలోడీ సాంగ్ చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఆ సాంగ్ నా మదిని తాకింది. ఇది ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రియల్‌గా జరిగిన స్టోరీ అని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు.. నాకు ఈ స్టోరీ తెలుసు. రియల్‌గా జరిగిన స్టోరీ ఇది. కచ్చితంగా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. డిసెంబర్ 19న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

Next Story