- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు బయోపిక్‌లో నటిస్తారా? హీరో శివ రాజ్ కుమార్ షాకింగ్ రిప్లై
కన్నడ స్టార్ శివ కుమార్ ప్రస్తుతం ఇల్లందు మాజీ ఎమ్మెడ్యే, సీపీఎంఎల్ నాయకుడు గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా నేడు ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని మొదటిసారి సతీమణి గీతా శివరాజ్‌కుమార్ తో కలిసి దర్శించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రస్తుతం ఇల్లందు మాజీ ఎమ్మెడ్యే, సీపీఎంఎల్ నాయకుడు గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా నేడు ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని మొదటిసారి సతీమణి గీతా శివరాజ్‌కుమార్ తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పటికే 2,3 తెలుగు సినిమాలలో ఆఫర్ వచ్చిందని కానీ ఇంకా సైన్ చేయలేదని చెప్పారు.
తెలుగు సినిమాలను ఇండియాలో కంటే ఎన్ ఆర్ఐలు ఎక్కువగా ఆధరిస్తారని అన్నారు. గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో నటిస్తున్నారు భవిష్యత్తులో మంచి డైరెక్టర్ వచ్చి చంద్రబాబు పాత్రలో నటించమంటే నటిస్తారా అని ప్రశ్నించారు. దానికి శివ రాజ్ కుమార్ బయోపిక్ లో నటించడం ఇదే మొదటిసారి అని తరవాత వస్తే చూస్తానని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పటికే గుమ్మడి నర్సయ్య ఫస్ట్ లుక్ విడుదలవ్వగా శివ రాజ్ కుమార్ లుక్ ఆకట్టుకుంటోంది. అచ్చం ఆయన గుమ్మడి నర్సయ్యలాగే కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.






