- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంతారా సినిమా కేసు.. మైసూర్ చాముండి ఆలయంలో హీరో రణవీర్‌సింగ్ పూజలు
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ అప్పట్లో కాంతారా సినిమాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో రణ్ వీర్ సింగ్ పంజర్లి దేవుడి హావభావాలను అనుకరిస్తూ చులకనగా మాట్లాడాడు.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ అప్పట్లో కాంతారా సినిమాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో రణ్ వీర్ సింగ్ పంజర్లి దేవుడి హావభావాలను అనుకరిస్తూ చులకనగా మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో కన్నడీకులు, పంజర్లి భక్తులు రణ్ వీర్ సింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేవుడిని ఎద్దేవా చేయడంపై రణ్ వీర్ సింగ్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై కొందరు భక్తులు హైకోర్టును సైతం ఆశ్రయించారు.
కేసును విచారించిన కోర్టు రణ్ వీర్ సింగ్ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఇతరులను మనోభావాలను కించపర్చడం తప్పేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా చాముండి ఆలయంలో పూజలు చేయాలని ఆదేశించింది. అయితే రణ్ వీర్ సింగ్ చాలా రోజుల క్రితమే క్షమాపణలు చెప్పగా తాజాగా మైసూర్ లోని చాముండి ఆలయంలో పూజలు చేశారు. ఇక రణ్ వీర్ సింగ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన ఇలాంటి పనులే చేసి వార్తల్లో నిలిచారు. దీంతో ఇప్పటికైనా రణ్ వీర్ సింగ్ మారాలని బుద్ధిగా సినిమాలు చేసుకోవాలని బాలీవుడ్ ప్రేక్షకులు కోరుతున్నారు.






