- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది క్రైమ్, కామెడీ ఎంటర్‌టైనర్.. ‘పాంచ్ మినార్’పై హైప్ పెంచేస్తున్న హీరో కామెంట్స్
రామ్ కడుముల దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైన్మెంట్ చిత్రం ‘పాంచ్ మినార్’(Panch Minar).

దిశ, సినిమా: రామ్ కడుముల దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైన్మెంట్ చిత్రం ‘పాంచ్ మినార్’(Panch Minar). రాజ్ తరుణ్(Raj Tharun), రాశి సింగ్( Rashi Singh) జంటగా నటిస్తున్న ఈ మూవీని గోవింద రాజు ప్రజెంట్ చేస్తుండగా కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్‌పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. పాజిటివ్ అంచనాల మధ్య ఈ మూవీ నవంబర్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మీడియాతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘సినిమాని ఈ ఏడాదిలోనే మొదలుపెట్టాం. ఇది ప్రాపర్ క్రైమ్ కామెడీ. కథ నుంచి బయటికి వెళ్లకుండా జానర్‌కి తగ్గట్టు ప్రతి సీన్‌లోనూ మంచి ఫన్ ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నాకు కథ వినగానే చాలా నచ్చింది. నిర్మాతలు సినిమాకి కావలసిన ప్రతిదీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సమకూర్చారు. మేము అనుకున్న దాని కంటే చాలా బెటర్‌గా వచ్చింది. పాంచ్ మినార్ ఈ సినిమాలో ఒక కీలక మలుపులో వినిపించే పదం. దాంతో కథ ఇంకో మలుపు తిరుగుతుంది. వినడానికి చాలా క్యాచిగా ఉండే పదం కావడంతో అదే టైటిల్‌గా పెట్టాం. ఉద్యోగం సంపాదించే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకునే ఓ కుర్రాడు ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు అనేది కథ.
ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎంత నలిగిపోతుందంటే చూసే వాళ్ళకి అంత నవ్వొస్తుంది. ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్ స్టోరీ. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల ప్రతి కథలో ఒక కొత్తదనం ఉంటుంది. ఏదో కొత్త పాయింట్ చెప్పారు అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాల్లో కూడా అలాంటి ఒక కొత్తదనం ఉంది. నా గత కొన్ని సినిమాల్లో అనుకున్నంత రీచ్ కాలేదు. అయితే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఈ సినిమా మాత్రం తప్పకుండా ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది. నాకు నా కెరియర్ విషయంలో ఎలాంటి తొందరపాటు లేదు. నేను గత ఏడాదిన్నరగా కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. అవి ఒక్కొక్కటిగా వస్తున్నాయి’ అని తెలిపారు.






