- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మాయిలా గుండె చప్పుడు.. మన ముందుకు వచ్చేది ఎప్పుడు.. ఇంట్రడక్షన్ వీడియోతో హైప్ పెంచిన హీరో
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) నటిస్తున్న తాజా సినిమా ‘అనగనగా ఒకరాజు’(Anaganaga Oka Raju).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) నటిస్తున్న తాజా సినిమా ‘అనగనగా ఒకరాజు’(Anaganaga Oka Raju). కళ్యాణ్ శంకర్ (Director Kalyan Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్, ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా.. గ్లింప్స్ చూస్తే.. నవీన్ మరోసారి ఆడియన్స్‌ను ఖచ్చితంగా నవ్విస్తాడని ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. దీంతో ‘అనగనగా ఒకరాజు’ చిత్రం ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై దర్శనమిస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్‌పై అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా నవీన్ పొలిశెట్టి పోస్టర్ షేర్ చేస్తూ.. ‘ది స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి ఈ సంక్రాంతికి ఒక ఉల్లాసభరితమైన కుటుంబ వినోదంతో తిరిగి రాబోతున్నాడు. అనగనగా ఒకరాజు సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సంక్రాంతికి మేము అందరికీ నవ్వు, ఆనందాన్ని అందించబోతున్నాము’ అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశారు. అలాగే.. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోలో.. ‘నెక్ట్స్ రాబోతుంది ఆరు అడుగుల అందగాడు.. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడేవాడు.. అమ్మాయిల గుండె చప్పుడు.. మన ముందుకు వచ్చేది ఎప్పుడు’ అంటూ నవీన్ ఇంట్రడక్షన్ వీడియోతోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు చిత్ర బృందం.






