- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Naveen Chandra: ఇందులో ట్విస్ట్‌లు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి.. హీరో కామెంట్స్‌తో మరింత హైప్
నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ (Investigative thriller) మూవీ ‘లెవెన్’ (Levan).

దిశ, సినిమా: నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ (Investigative thriller) మూవీ ‘లెవెన్’ (Levan). పలు యాక్షన్ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. ఇందులో నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. రుచిర ఎంటర్టైన్మెంట్స్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర మీడియాతో ముచ్చటించారు.
‘‘లెవన్’ అనేది కథ నుంచి వచ్చిన టైటిల్. సినిమా చూసినప్పుడు మీకే తెలుస్తుంది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. తమిళ్‌లో షోస్ జరిగాయి. యునానిమాస్‌గా సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు ఆడియన్స్. మేము అనుకున్న ట్విస్ట్‌లు, టర్న్స్, అడ్రినల్ రష్ మూమెంట్స్ ప్రేక్షకులని ఎక్సయిట్ చేశాయి. ఆడియన్స్ రెస్పాన్స్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ దొరికింది. ఇప్పటివరకూ ఏ థ్రిల్లర్‌లో రాని ఒక డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉంది. ఆడియన్స్‌కి చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇందులో ట్విస్ట్ లని ముందుగా డీకోడ్ చేయడం కష్టం. ఈ చిత్రం కచ్చితంగా మంచి హిట్ అవుతోంది’ అంటూ చెప్పుకొచ్చాడు.






