- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రివ్యూలు ఆపేయాలి.. బ్యాన్ చేయాలి అనలేను.. కానీ’.. HERO నాని కీలక వ్యాఖ్యలు
ఒకప్పుడు సినిమా(Movie) భవిష్యత్ అభిమానుల చేతిలో ఉంటే.. ఇప్పుడు రివ్యూలు(Reviews) ఇచ్చేవారి చేతిలో ఉందనే చెప్పాలి.

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు సినిమా(Movie) భవిష్యత్ అభిమానుల చేతిలో ఉంటే.. ఇప్పుడు రివ్యూలు(Reviews) ఇచ్చేవారి చేతిలో ఉందనే చెప్పాలి. నిఖార్సైన సినిమా ప్రేమికులు వినహాయించి.. మెజార్టీ పీపుల్ రివ్యూలు చూసే సినిమాలకు వెళ్తుంటారు. ఈ రివ్యూల కారణంగా మంచి సినిమాలపై నెగిటివ్ ప్రచారం జరిగి అభిమానులు థియేటర్స్‌కు రావడం మానేస్తున్నారని నిర్మాతలు అనేకసార్లు బహిగంగంగానే చెప్పారు. తాజాగా రివ్యూలపై ప్రముఖ తెలుగు హీరో నాని(Nani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘రివ్యూలు ఇచ్చేవారిని మనం ఆపలేం.. అయినా ఎవరినని ఆపుతాం.. ఎంతమందినని ఆపుతాం.. అది జరిగే పని కాదు. కానీ మంచి సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా అది వ్యక్తిగత అభిప్రాయం లాగా ఉండాలి కానీ.. అందరి అభిప్రాయం ఇదే అనే కోణంలో రుద్దొద్దు. ఇటీవల ఫస్ట్ షో పడగానే కొన్ని సినిమాలను డిజాస్టర్ అని తేల్చేస్తున్నారు. ఇది సరైంది కాదు.. విడుదలైన వారం పది రోజుల తర్వాత సినిమాలకు వచ్చే అభిమానుల తాకిడి బట్టి అది డిజాస్టరా? అట్టర్ ప్లాపా అనేది డిసైడ్ చేయాలి. అందరిలా రివ్యూల్ని బ్యాన్ చేయాలి.. ఆపేయాలి అంటూ గొంతు చించుకోను కానీ.. అభిమానులను థియేటర్‌కు రాకుండా చేయొద్దని వేడుకుంటున్నాను’’ అని నాని తెలిపారు.
కాగా, ‘హిట్’ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న సరికొత్త చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’లో నాని (Nani) కథానాయకుడిగా నటిస్తున్నారు. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో నాని సరసన శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) నటిస్తోంది. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ‘హిట్ 3’ ప్రీసేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
హీరో నాని : ఎవరిని ఆపుతారు? ఎందుకు ఆగుతుంది? ఎలా ఆపుతారు?
— Telugu360 (@Telugu360) April 22, 2025
రివ్యూలపై హీరో నానికంటూ ఓ నిర్దిష్టమైన అభిప్రాయం వుంది.
ఆయన కూడా అందరిలా రివ్యూల్ని బ్యాన్ చేయాలి.. ఆపేయాలి అంటూ గొంతు చించుకోలేదు.
రివ్యూలపై నాని తన అభిప్రాయాన్ని తెలుగు360 ఇంటర్వ్యూ లో ఇలా… pic.twitter.com/86kgv2qzbh






