Nani: ఆ సినిమా రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది అంటారు.. కానీ జస్ట్ బ్రేక్ ఈవెన్ అంతే.. నాని షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

నేచురల్ స్టార్ నాని (Nani) సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’

Nani: ఆ సినిమా రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది అంటారు.. కానీ జస్ట్ బ్రేక్ ఈవెన్ అంతే.. నాని షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani) సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’ (Court). ఇందులో ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శ్రీదేవి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీశ్ (Ram Jagadish) తెరకెక్కించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా రిలీజైన ట్రైలర్‌ (Trailer)కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఇక భారీ అంచనాల మధ్య కోర్ట్ చిత్రం మార్చి 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ముచ్చట్లు పంచుకున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా నాని తను నటించిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ (Bhimili Kabaddi Jattu), ‘పిల్లజమీందార్’ (Pilla Zamindar)చిత్రాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘ఒక మంచి సినిమా క్రెడిట్ అనేది ఎక్కడికి వెళ్లదు. చాలా సార్లు.. మంచి సినిమా తీశాము కానీ వేస్ట్ అయిపోంది అని అనుకుంటారు కదా. అయితే.. ఎప్పటికీ వేస్ట్ అవ్వనిది ఏదన్న ఉంది అంటే అది మంచి సినిమానే. ఏదో ఒకరంగా ఏదో ఒక రోజు మీకు రావాల్సింది అంతా వచ్చేలా చేస్తుంది. ఈరోజు రిలీజై మీకు హిట్ అవ్వలేదు అనుకోండి.. ఒక మూడేళ్ల తర్వాత రీరిలీజ్ చేసిన ఇప్పటి కంటే కూడా నాలుగు రెట్లు మాట్లాడుకునేలా చేస్తుంది. నిజానికి నేను నటించిన ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘పిల్లజమీందార్’ రిలీజ్ అయినప్పుడు జస్ట్ బ్రేక్ ఈవెన్ ఇచ్చాయి అంతే. ఈరోజుకు కూడా నేను ఎక్కడకన్న వెళ్తే ఆ సినిమాల గురించి మాట్లాడతారు. అంతే కాదు.. ‘పిల్లజమీందార్’ ఒక రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది అంటారు. అలాగే నాని కెరీర్‌లో పెద్ద హిట్ అనుకుంటారు. కాబట్టి.. నువ్వు ఎప్పుడైతే మంచి సినిమా తీశావో అప్పుడే విన్ అయినట్లు’ అటూ చెప్పుకొచ్చాడు నాని.

Next Story