‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. పవన్ కల్యాణ్ డైలాగ్‌తో జోష్ పెంచిన హీరో

by Gantepaka Srikanth |

హిట్ -3 సినిమా(HIT- 3 Movie)పై చాలా నమ్మకంగా ఉన్నానని నాచురల్ స్టార్ నాని(Nani) ధీమా వ్యక్తం చేశారు. హిట్ -3 ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించారు.

‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. పవన్ కల్యాణ్ డైలాగ్‌తో జోష్ పెంచిన హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: హిట్ -3 సినిమా(HIT- 3 Movie)పై చాలా నమ్మకంగా ఉన్నానని నాచురల్ స్టార్ నాని(Nani) ధీమా వ్యక్తం చేశారు. హిట్ -3 ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి సినిమా చేశాం.. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. మంచి హిట్టు కొట్టబోతున్నామనే నమ్మకం అందరిలోనూ ఏర్పడిందని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డైలాగ్ చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. శైలేశ్ కొల‌ను దర్శకత్వం వహించిన HIT- 3 సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నాడు. రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్, అదిల్ పాలా, సూర్య శ్రీనివాస్ తదితరలు నటించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా మేడే కానుకగా మే 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

Next Story