- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున.. ఎందుకంటే..?
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన నాగార్జున ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన నాగార్జున (Nagarjuna) ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. కొద్ది నెలల కిందట తెలంగాణ మంత్రి తమ కుటుంబంపై చేసిన ఆరోపణలపై కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులోనే పలుమార్లు వారు కోర్టుకు వెళ్లాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి హీరో నాగార్జున ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించారు. కొంత మంది తన ఫొటో, పేరును వాడుకుంటున్నారని.. తన అనుమతి లేకుండా తన పేరు గాని, ఫొటోలు గాని వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని నాగార్జున కోర్టులో పిటిషన్ వేశారు. సినీ నటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దని గతంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.
నాగార్జున పేర్కొన్న ప్రకారం, అనధికారికంగా అతని పేరుతో అనేక వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం అవుతున్నాయి. అలాగే, అతని లైక్నెస్‌తో ఏఐ ఆధారంగా వీడియోలు, కంటెంట్ రూపొందించడం, అనధికారిక వాణిజ్య ప్రకటనల్లో ఉపయోగించడం జరుగుతుందని పేర్కొన్నారు. కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభించి, తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలా అన్న అంశాన్ని పరిశీలిస్తోంది. ఇటీవలి సందర్భాలలో బాలీవుడ్ నటులు ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు కూడా కోర్టు వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఉత్తర్వులు జారీ చేసిన విషయం గుర్తుచేసుకుంటూ, నాగార్జున పిటిషన్ కూడా వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణలో ముఖ్యమైన సందర్భంగా భావించబడుతోంది. ఈ క్రమంలో హీరో నాగార్జున పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.






