రెండో సినిమాకే కోట్లల్లో రెమ్యునరేషన్.. అసలు విషయం బయటపెట్టిన యంగ్ హీరో మౌళి

by Chukka Sudharani |

90's సిరీస్ ఫేమ్ మౌళి.. రీసెంట్‌గా లిటిల్ హార్ట్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రెండో సినిమాకే కోట్లల్లో రెమ్యునరేషన్.. అసలు విషయం బయటపెట్టిన యంగ్ హీరో మౌళి
X

దిశ, సినిమా: 90's సిరీస్ ఫేమ్ మౌళి.. రీసెంట్‌గా లిటిల్ హార్ట్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో రిలీజైన ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. ఇందులో శివాని నాగరం హీరోయిన్‌గా నటించగా.. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా.. ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్టులు బద్దలు కొడుతూ అత్యధిక వ్యూస్‌తో కొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇలా ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో తన క్రేజ్ విపరీతంగా పెంచేసుకున్నా యంగ్ హీరో మౌళి.. ఇప్పుడు తన రెండో చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు.

అయితే.. మౌళి రెండో సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఏకంగా కోట్లలో రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్. అలాగే ఇప్పటికే రూ. కోటి అడ్వాన్స్ ఇచ్చినట్లు నెట్టింట వార్తలు జోరుగా ప్రచారం జరుగుతుండగా.. ‘రెండో సినిమాకే కోట్లల్లో రెమ్యునరేషనా.. ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఓవర్ చేసేస్తారు’ అంటూ అప్పుడే ట్రోల్స్ స్టార్ట్ చేశారు కొందరు నెటిజన్లు. ఈ క్రమంలోనే కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన యంగ్ హీరో మౌళి.. ‘ఏ నిర్మాణ సంస్థ కూడా నాకు కోటి రూపాయలు ఆఫర్ చేయలేదు. దయచేసి ఆ వార్తలను పట్టించుకోకండి.. ప్రస్తుతం నేను నా రెండవ సినిమా కోసం పని చేస్తున్నాను’ అని తెలిపాడు.

Next Story