- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Thiruveer : తీవ్ర చలిలో కూడా ఆ పనిని ఆపకుండా చేశానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన మసూద హీరో
ఇప్పటి వరకు చేసిన పాత్రల కన్నా చాలా కొత్తగా ఉంది

దిశ, వెబ్ డెస్క్ : స్టేజ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి " జార్జ్ రెడ్డి " చిత్రంతో తిరువీర్ ( Thiruveer ) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత " పలాస 1978 ", " టక్ జగదీశ్ "సినిమాలో కూడా నటనతో అందర్ని మెప్పించాడు. ఆ తర్వాత మసూద, పరేషన్.. మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ హీరోగా హిట్స్ కొట్టాడు. " మసూద " చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది. దీంతో, ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు.
ప్రస్తుతం, తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ ( The Great Pre Wedding Show ) అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఫోటోగ్రాఫర్ గా కనిపించనున్నాడు. రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం మన ముందుకు రానుంది. తాజాగా, తిరువీర్ తన కొత్త సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో మాట్లాడాడు.
తిరువీర్ మాట్లాడుతూ.. " వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కుర్రాడి పాత్ర ఇప్పటి వరకు చేసిన పాత్రల కన్నా చాలా కొత్తగా ఉంది. మొబైల్‌తో చాలా ఫోటోలు తీశాను కానీ, ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా నటించడం నాకు ఛాలెంజింగ్‌గా ఉంది. మంచి ఫోటో కోసం స్టిల్స్ ఎలా పెట్టించాలి, కెమెరాను ఎన్ని యాంగిల్స్ లో వాడొచ్చు, ఫోటోగ్రఫీ గురించి.. ఇలా ఎన్నో కొత్త విషయాలను ఈ చిత్రం కోసమే నేర్చుకున్నాను. ఇటీవల ఈ మూవీ షూటింగ్ అరకులో జరిగింది. అక్కడి గడ్డ కట్టే చలిని కూడా తట్టుకుని మా టీం అంతా కష్టపడి సినిమా షూట్ చేశామని " తెలిపారు.
ఇక తిరువీర్ ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో తర్వాత భగవంతుడు, మోక్షపటం అనే రెండు ప్రాజెక్టు లు చేస్తున్నాడు. అవి కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అవి కాకుండా, మరో రెండు చిత్రాలు కూడా తిరువీర్ చేతిలో ఉన్నాయి. " మసూద " తర్వాత ఎలా పడితే అలా తీయకుండా.. చాలా సెలెక్టివ్‌గా సినిమాలని ఎంచుకుని ముందుకు వెళ్తున్నాడు. కొన్ని నెలల క్రితమే తిరువీర్ వివాహం చేసుకున్నాడు.






