Hyderabad: మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మంచు మనోజ్

by Gantepaka Srikanth |

మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఫ్యామిలీ వివాదం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

Hyderabad: మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మంచు మనోజ్
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఫ్యామిలీ వివాదం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. మంచు మనోజ్(Manchu Manoj), మోహన్ బాబు(Mohan Babu) తండ్రి, కొడుకులు ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజాగా.. మంచు మనోజ్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్టెక్కినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీస్‌ స్టేషన్‌(Pahadi Shareef Police Station)లో నిన్నటి ఘర్షణపై మరోసారి కంప్లైంట్ చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పంపకాల్లో తనకు అన్యాయం జరుగుతుందని భావించడంతో మనోజ్(Manoj) తండ్రిని ఎదిరించాడని.. అక్కడే అసలు గొడవ మొదలైందని సమాచారం. వాదనలు తారాస్థాయికి చేరడంతో ఒకరిపై ఒకరు ఘర్షణకి దిగినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడే కాదు.. గతంలో కూడా మంచు మనోజ్‌కు.. మంచు విష్ణుకి విభేదాలు తలెత్తాయి. కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Next Story