- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుడ్ బిజినెస్‌లోకి త్వరలో యంగ్ హీరో ఎంట్రీ.. రాజకీయాలపైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దిల్‌రూబా’.

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దిల్‌రూబా’. ఈ మూవీ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు చిత్ర బృందం. ఇందులో భాగంగా.. కిరణ్ అబ్బవరం రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘మంచి, చెడు అనేది పక్కన పెడితే నాకు ప్రజలతో ఎక్కువగా మమేకం కావడం ఇష్టం. రాయలసీమకు చెందిన వ్యక్తిని కావడంతో చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలను దగ్గరగా చూశా. అందుకే నాకు రాజకీయాలు పట్ల ఆసక్తి పెరిగింది. యాక్టర్‌ను కాకపోయి ఉంటే నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టేవాడిని. ఇక భవిష్యత్తులో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనకుంటున్నా. ఫుడ్ బిజినెస్(Food business)లో రాణించాలనేది నా కోరిక. మంచి రాయలసీమ స్టైల్స్ ఆహారం (Rayalaseema Styles Food) అందించాలని ఉంది. ప్రజెంట్ దానికి సంబంధించిన సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే దానిపై ఒక క్లారిటికీ వచ్చి అనౌన్స్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.






