- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kiran Abbavaram: నిర్మాణ రంగంలోకి మరో యంగ్ హీరో.. సొంత బ్యానర్‌లో సినిమా అనౌన్స్‌మెంట్
డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే.. తాజాగా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

దిశ, సినిమా: డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే.. తాజాగా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఈ హీరో తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశాడు. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. ‘ప్రతి ప్రయాణం ఒక కలతో మొదలవుతుంది.. అది నిజం అయ్యే వరకు దానికి ఎవరూ నమ్మరు. నేను 7 సంవత్సరాల క్రితం అలాంటి ఒక కలతో.. చాలా వదులుకుని నా ప్రయాణాన్ని ప్రారంభించాను. షార్ట్ ఫిల్మ్‌ల నుండి ఫీచర్ ఫిల్మ్‌ల వరకు అండ్ ఇప్పుడు ‘KA ప్రొడక్షన్స్’ ద్వారా నా కలను కొద్దిపాటి నిజం చేయగలుగుతున్నాను. లైఫ్ అండ్ నా సపోర్ట్స్ కారణంగా నేను సాధించిన ఈ కలతో.. కొత్త ప్రతిభను మీ అందరికి పరిచయం చేయబోతున్నాను. జులై 10న ‘KA ప్రొడక్షన్స్’లో రాబోతున్న కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేయబోతున్నాను. ఈ ప్రయాణంలో నాకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో.. కిరణ్ అబ్బవరం’ అని చెప్పుకొచ్చాడు. లింక్






