- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kiran Abbavaram : మరో మూడు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టిన కిరణ్ అబ్బవరం.. ఉగాది రోజు అంటూ పోస్ట్
కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కె-ర్యాంప్’.

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కె-ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో యుక్తి తరేజ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ అక్టోబర్ 18న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు కిరణ్ అబ్బవరం. ఇదిలా ఉంటే.. ‘కె-ర్యాంప్’ తర్వాత ఈ హీరో అప్పుడే మరో మూడు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టినట్లు తెలుస్తుంది. ఇటీవల ఈ హీరో కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
కె.ఎ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసిన కిరణ్.. ఇప్పుడు తన సొంత బ్యానర్‌లోనే ఈ మూడు ప్రాజెక్టులు తెరకెక్కించబోతున్నట్లు టాక్. ఇందులో ఓ సినిమాకు ‘ఉగాది రోజు’ అనే టైటిల్ ఫిక్స్ చెయ్యగా.. తన టీమ్‌లోని ఓ టెక్నీషియన్‌ను దర్శకుడిగా ప్రమోట్ చేయనున్నాడట కిరణ్ అబ్బవరం. కె-ర్యాంప్ సందడి పూర్తికాగానే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుండగా.. టైటిల్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెలిజన్లు.






