Kiran Abbavaram: రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ హిట్.. ఏకంగా 8 సినిమాలు లైన్లో పెట్టి ఆశ్చర్యపరిచిన హీరో

by Chukka Sudharani |   (  Updated:2025-09-01 15:57:20  IST  )

గతేడాది ‘క’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం.

Kiran Abbavaram: రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ హిట్.. ఏకంగా 8 సినిమాలు లైన్లో పెట్టి ఆశ్చర్యపరిచిన హీరో
X

దిశ, సినిమా: గతేడాది ‘క’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ మూవీతో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ హీరో ప్రజెంట్ వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ‘దిల్ రూబా’తో వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా థియేటర్స్‌లో ఊహించిన విజయం సాధించలేకపోయింది. ప్రజెంట్ చెన్నై లవ్‌స్టోరీ చేస్తున్నాడు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో గౌరీ ప్రియ హీరోయిన్‌గ నటిస్తుంది. ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా.. ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం నెలకొంది. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. ఇప్పుడు ‘మిర్జాపూర్’ (Mirzapur) ఫేమ్ ఆనంద్ అయ్యార్ దర్శకత్వంలో మరో మూవీ లైన్ పెట్టాడు కిరణ్ అబ్బవరం. దీన్ని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నర్మిస్తుందని తెలుస్తుండగా.. పాన్ ఇండియా మూవీగా రూపొందబోతున్నట్లు టాక్. ఇలా దాదాపు కిరణ్ అబ్బవరం దాదాపు 8 ప్రాజెక్టులు లైన్‌లో పెట్టినట్లు తెలుస్తుంది. వీటిపై కూడా త్వరలో అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్.

Next Story