లండన్‌లో హీరో-హీరోయిన్ విగ్రహాష్కరణ

by Gantepaka Srikanth |

లండన్‌లో హీరో-హీరోయిన్ విగ్రహాష్కరణ

లండన్‌లో హీరో-హీరోయిన్ విగ్రహాష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్‌, కాజోల్‌(Shah Rukh Khan-Kajol) జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు హిట్‌గా నిలిచాయి. ప్రేక్షకుల గుండెల్లో నిలిచే ప్రేమకథల్లో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిగ్నేచర్‌ పోజుతో కూడిన కాంస్య విగ్రహాలను రూపొందించారు. లండన్‌లోని లీసెస్టర్‌ స్క్వేర్‌లో ఏర్పాటైన వాటిని షారుక్‌- కాజోల్‌ గురువారం ఆవిష్కరించారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ సినిమా ఇదే. ఇంతకుముందు.. ‘హ్యారీ పోటర్‌’, ‘మేరీ పాపిన్స్‌’లాంటి కొన్ని హాలీవుడ్‌ చిత్రాల విగ్రహాలు కొలువుదీరాయి. విగ్రహావిష్కరణ అనంతరం షారుక్‌ మాట్లాడారు. ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్ అని చెప్పారు. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయని చెప్పారు. ఈ చిత్రంలో నేను భాగం కావడం నా అదృష్టం అని అన్నారు.

Next Story