ఇంటర్వెల్ మిమ్మల్ని షాక్‌కు గురిచేస్తుంది.. సినిమాపై హైప్ పెంచేసిన హీరో కామెంట్స్

by Chukka Sudharani |

‘శుభం’ ఫేమ్ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న ‘దీవాన’ సినిమా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది.

ఇంటర్వెల్ మిమ్మల్ని షాక్‌కు గురిచేస్తుంది.. సినిమాపై హైప్ పెంచేసిన హీరో కామెంట్స్
X

దిశ, సినిమా: ‘శుభం’ ఫేమ్ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న ‘దీవాన’ సినిమా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న హర్షిత్ రెడ్డి.. తన కెరీర్ విశేషాలతో పాటు మూవీ హైలైట్స్ తెలిపారు. ‘ఫస్ట్ నేను ‘ఆహా’లో ‘మెయిల్’ సినిమా చేశాను. ఆ సినిమాలో బీకామ్ కంప్యూటర్స్ అంటూ నేను చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. ఆ డైలాగ్ నచ్చి రాజ్ అండ్ డీకే శుభం సినిమాకు నన్ను ఎంపిక చేశారు. ఇదంతా ఒక డెస్టినీలా జరిగిపోయింది. తర్వాత కల్కి సినిమాలో ఆడిషన్ లేకుండానే నన్ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ సెలెక్ట్ చేశారు. నేను బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉండగా ఈ అవకాశాలు ఒక్కొక్కటిగా రావడం మొదలైంది. అయితే.. ‘శుభం’ సినిమా కంటే ముందే ‘దీవాన’ ఆఫర్ వచ్చింది. ప్రేమలో పూర్తిగా మునిగిన ఓ కుర్రాడి కథే ‘దీవాన’. మనం చాలా ప్రేమ కథలు చూసి ఉంటాం గానీ ఇందులో ఒక కొత్త పాయింట్, ఎమోషన్ ఉంటుంది. ఆ పాయింట్‌తో వచ్చే ఇంటర్వెల్ మిమ్మల్ని షాక్‌కు గురిచేస్తుంది. కొద్ది నిమిషాలు మీరు అలా ఉండిపోతారు. మేము ట్రైలర్, టీజర్‌లో కూడా ఆ పాయింట్ ఎక్కడా రివీల్ చేయలేదు. మనం రియల్ లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి దీవాన అవుతాం. కచ్చితంగా ప్రతీ ఒక్కరిని ఈ చిత్రం ఆకట్టుకుంటోంది’ అని చెప్పుకొచ్చాడు.

Next Story