GV Prakash: సినీ చరిత్రలోనే ఇదో విభిన్న కథ.. ‘కింగ్‌స్టోన్’పై భారీ హైప్

by Chukka Sudharani |

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar) తన 25వ చిత్రం ‘కింగ్‌స్టోన్’ (Kingstone)తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

GV Prakash: సినీ చరిత్రలోనే ఇదో విభిన్న కథ.. ‘కింగ్‌స్టోన్’పై భారీ హైప్
X

దిశ, సినిమా: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar) తన 25వ చిత్రం ‘కింగ్‌స్టోన్’ (Kingstone)తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌ (Fantasy adventure thriller)గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, పార్లల్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్, ఉమేష్, బన్‌సాల్ నిర్మిస్తుండగా.. కమల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్క అప్‌డేట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అలాగే రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌(Trailer)తో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీ మార్చి 7న థియేటర్‌లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవీ ప్రకాష్ సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. ‘‘కింగ్‌స్టోన్’ చిత్రం భారతీయ సినిమా చరిత్ర (History of Indian Cinema)లో మొట్టమొదటి సముద్ర కథాంశంతో రూపొందిన అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం. ఫాంటసీ, హారర్ కలబోసిన ఈ మూవీని ప్రేక్షకులు సరికొత్తగా ఆస్వాదించేలా రూపొందించాము. ముఖ్యంగా సముద్ర గర్భంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్రత్యేకమైన టెక్నికల్ టీమ్‌ను రంగంలోకి దింపాల్సి వచ్చింది. అంతే కాకుండా సినిమా ఎఫెక్ట్ కోసం అంతర్జాతీయ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కూడా వాడాం. ఈ కథలో ఒక మత్స్యకారుడు తన గ్రామాన్ని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు, శాపాన్ని ధైర్యంగా ఎదుర్కొనే తీరు ఆకట్టుకునేలా ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story