ఇద్దరు సీనియర్ హీరోలతో ధనుష్.. కొత్త సినిమాపై క్రేజీ అప్డేట్

by Ajay Maddhiboyina |

తమిళస్టార్ హీరో ధనుష్ నెక్స్ట్ సినిమాపై క్రేజీ వార్తలు వినినిపిస్తున్నాయి. ధనుష్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలను రెండు భాషల్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగునాట సైతం ధనుష్ సినిమాలకు క్రేజ్ ఏర్పడింది.

ఇద్దరు సీనియర్ హీరోలతో ధనుష్.. కొత్త సినిమాపై క్రేజీ అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళస్టార్ హీరో ధనుష్ నెక్స్ట్ సినిమాపై క్రేజీ వార్తలు వినినిపిస్తున్నాయి. ధనుష్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలను రెండు భాషల్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగునాట సైతం ధనుష్ సినిమాలకు క్రేజ్ ఏర్పడింది. ధనుష్ హీరోగా నటించిన రఘువరుణ్ బీటెక్ సినిమాతో మొదట తెలుగులో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమా తమిళ్ లో కంటే తెలుగులోనే పెద్ద హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గా తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కుబేర సినిమా రాగా ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఇక ఇప్పుడు ధనుష్ తన తరవాత సినిమాలో సీనియర్ హీరోలు కమల్ హాసన్, రజినీకాంత్ లతో కలిసి నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయని తలైవార్ 173 పేరుతో వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తారని కూడా ఫిల్మీ దునియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే జరిగితే ఇది మరో భారీ మల్టీ స్టారర్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ కావాలని తమిళనాట మూవీ లవర్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు.

Next Story