- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆపరేషన్ ఖుక్రీ’ సినిమాలో హీరో కన్ఫార్మ్.. ఈ కథ ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చే శక్తిని కలిగి ఉందంటూ కామెంట్స్
ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 26మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 26మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రతీకారం తీర్చుకున్నారు. ఇక ఇందులో భారత్ ఆర్మీ పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించడంతో పాటు దాడికి భారతీయులకు ఏమీ కాకుండా ధైర్యంగా కాపాడారు. దీంతో యావత్ భారత్ ఆర్మీపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈక్రమంలోనే.. పలువురు హీరోలు ఆర్మీ కథలతో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. తాజాగా, బాలీవుడ్ హీరో రణదీప్ హుడా స్పెషల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఆపరేషన్ ఖుక్రీ’ (Operation Khukri)పేరుతో రాబోతున్నట్లు సమాచారం.
అయితే ఈ చిత్రాన్ని రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్‌దీప్ హుడా ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ కథ ఆపరేషన్ ఖుక్రి పుస్తకం నుండి తీసుకోబడింది. అయితే ఈ సినిమా సియెర్రాలియోన్‌లో ఇండియన్ ఆర్మీ సాహసోపేతమైన 2000 రెస్క్యూ మిషన్ ఆధారంగా తెరకెక్కనున్నట్లు టాక్. 75 రోజుల ముట్టడి నుండి 233 మంది సైనికులను బయటకు నడిపించిన మేజర్ జనరల్ రాజ్‌పాల్‌పునియా(Rajpalpunia) పాత్రలో రణదీప్ హుడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భారతదేశపు అత్యంత వీరోచిత సైనిక అధ్యాయాలలో ఒకటైన ధైర్యం, వ్యూహం, త్యాగం కథగా రూపొందుతోంది. ప్రస్తుతం ఇందుకు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ఈ సినిమా గురించి రణదీప్ హుడా ‘‘ఆపరేషన్ ఖుక్రీ అనేది నన్ను గాఢంగా కదిలించిన కథ. ఇది కేవలం తుపాకులు, కీర్తి కథ కాదు. త్యాగం, సోదరాభావం, అధిగమించలేని పరిస్థితులు ఎదుర్కొని అలుపెరగని ధైర్యం కథ. తెలియని దేశంలో 75 రోజుల ముట్టడి నుంచి తన సైనికులను బయటకు నడిపించిన వ్యక్తి మేజర్ జనరల్ పునియా స్థానంలోకి అడుగు పెట్టడం ఒక గౌరవం, బాధ్యత. భారత సైనిక చరిత్రలో ఒక అధ్యాయాన్ని సజీవంగా తీసుకురావడమే మా లక్ష్యం. ఇది కేవలం దృశ్యానికి మాత్రమే కాకుండా లొంగిపోయేందుకు చనిపోవడానికి ఇష్టపడే మన సైనికుల స్పూర్తికి కూడా చాలా ఎక్కువ గుర్తింపు పొందాలి. ఈ కథ ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చే శక్తిని కలిగి ఉందని నేను నమ్ములున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.






