- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీ లీలతో హీరో చంద్రహాస్ పెళ్ళి.. షాకింగ్ వీడియో?
ఎవరిని పెళ్లి చేసుకుంటావ్? ఎవరితో డేటింగ్ చేస్తావ్? అని ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నిస్తుంది. దీంతో వెంటనే శ్రీ లీలను పెళ్లి చేసుకొని, డేట్ మాత్రం మృణాల్ ఠాగూర్ ను చేస్తానని బాంబు పేల్చాడు చంద్రహాస్.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది కొత్త కుర్రాళ్ళు హీరోలుగా ఎదుగుతున్నారు. గతంలో లాగా ఇండస్ట్రీలో పరిస్థితులు లేవు. టాలెంటు ఉంటే చాలు స్టార్ హీరో అయిపోతున్నారు. మంచి కథతో సినిమా చేసి సక్సెస్ అవుతున్నారు యంగ్ హీరోలు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సరే, ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. అయితే మరి కొంత మంది బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి కూడా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో చంద్రహాస్ ఒకరు. ఈటీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్. ఇప్పటికే వెండితెరకు పరిచయమైన చంద్రహాస్, బరాబర్ సినిమాతో సందడి చేసేందుకు వస్తున్నాడు.
శ్రీ లీల అయితే పెళ్లి చేసుకుంటా... చంద్రహాస్ ఉత్సాహం
అలాంటి చంద్రహాస్, బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రమోషన్ లో భాగంగా గుంజి గుంజి పాట వివాదంలో చిక్కుకున్నాడు. అయితే, ఈ పాటపై చాలామంది హీరో చంద్రహాస్ పై కేసు పెట్టడం కూడా చూశాం. ఇది ఇలా ఉండగా శ్రీ లీల అయితే పెళ్లి చేసుకుంటానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు హీరో చంద్రహాస్. తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యంగ్ హీరో చంద్రహాస్, పై వ్యాఖ్యలు చేశారు.
ఎవరిని పెళ్లి చేసుకుంటావ్? ఎవరితో డేటింగ్ చేస్తావ్? అని ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నిస్తుంది. దీంతో వెంటనే శ్రీ లీలను పెళ్లి చేసుకొని, డేట్ మాత్రం మృణాల్ ఠాగూర్ ను చేస్తానని బాంబు పేల్చాడు చంద్రహాస్. అనుపమ పరమేశ్వరన్ లాంటి కత్తి హీరోయిన్ మాత్రం రిజెక్ట్ చేస్తానని వెల్లడించాడు. దీంతో చంద్రహాస్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా, చంద్రహాస్ హీరోగా చేసిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ కానుంది.






