ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో అద్భుతంగా ఉంటుంది .. బరాబర్ ప్రేమిస్తా సినిమాపై హీరో కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2026-02-02 08:28:10  IST  )

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా నటిస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో అద్భుతంగా ఉంటుంది .. బరాబర్ ప్రేమిస్తా సినిమాపై హీరో కామెంట్స్
X

దిశ, సినిమా: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా నటిస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు జయంత్ సి పరాన్జీ, జేడీ చక్రవర్తి, ఆది సాయి కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ ఈవెంట్‌లో.. ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ.. ‘జయంత్ గారు తీసిన ‘తీన్ మార్’, ‘శంకర్ దాదా’ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆది అన్న అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆది అన్నే నాకు స్పూర్తి. జేడీ చక్రవర్తి గారు అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నారు. ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన చిన్ని, చందు, వెంకీలకు థాంక్స్. ఈ ప్రాజెక్ట్ నాకు రావడానికి కారణమైన కెమెరామెన్ శేఖర్ అన్నకి థాంక్స్. ఈ సినిమా ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. లెక్కపెట్టలేనన్ని, ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో అద్భుతంగా ఉంటుంది. ప్రారంభం నుంచి చివరి వరకు అలా కూర్చుని చూస్తుండిపోతారు. ఫిబ్రవరి 6న మా చిత్రాన్ని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రభాకర్ అన్నతో నేను ‘నెక్ట్స్ నువ్వే’ మూవీని చేశాను. అప్పుడు నాకు చంద్రహాస్ గురించి ఎక్కువగా చెబుతుండేవారు. మంచి హీరో అవుతాడని అప్పుడే అనుకున్నాను. ఆయన పడే కష్టాన్ని చూస్తున్నాను. ఎంతో నిజాయితీగా కష్టపడుతున్నాడు. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాతో చంద్రహాస్‌కు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపాడు.

Read More..

షూటింగ్ స్టార్ట్.. ఓటీటీ డీల్ క్లోజ్.. రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసిన కోర్టు హీరోయిన్ మూవీ

Next Story