ఇట్స్ అఫీషియల్.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం- పెళ్లి ముహూర్తం ఫిక్స్

by Chukka Sudharani |

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్మెంట్, పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

ఇట్స్ అఫీషియల్.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం- పెళ్లి ముహూర్తం ఫిక్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి రోకా వేడుక గత నెలలో అంగరంగ వైభవవంగా జరిగింది. సంప్రదాయం, కుటుంబ ఆత్మీయతల కలయికతో జరిగిన ఈ వేడుక, వారి వివాహ ప్రయాణానికి ఒక పరిపూర్ణమైన ఆరంభాన్ని ఇచ్చింది. అయితే.. వీరి పెళ్లి డేట్‌పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తుండగా.. తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. విశాలమైన ఫామ్‌హౌస్‌లో ఆత్మీయతల మధ్య వీరి నిశ్చితార్థం ఏప్రిల్ 5న జరగనుంది. ఈ వేడుకలో సినీ పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు. వీరి వివాహ వేడుక ఏప్రిల్ 29న, దివ్యమైన తిరుమల ప్రాంగణంలో జరగనుందని తెలిపారు.

Next Story