బాలయ్య చిలిపి పనులు...హీరోయిన్ ఏం చేసిందంటే ?

by velandi.Saikiran |

టాలీవుడ్ అగ్ర హీరో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య ( Nandamuri Balayya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన

బాలయ్య చిలిపి పనులు...హీరోయిన్ ఏం చేసిందంటే ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ అగ్ర హీరో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య ( Nandamuri Balayya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు. అల్లరి పనులు చేస్తూ వైరల్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు కోపం వస్తే.. ఫ్యాన్స్ ను ఒక ఆట ఆడుకుంటారు. ఈ నేపథ్యంలోనే బాలయ్యకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా బాలయ్య చేసిన ఓ అల్లరి పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోయిన్ సంయుక్త మీనన్ ( Sanyukta Menon) అలాగే నందమూరి బాలయ్య ఇద్దరు కలిసి ఏలూరు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన జువెలరీ షాప్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా... ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు మాట్లాడారు. అయితే హీరోయిన్స్ సంయుక్త మాట్లాడే సమయంలో... అక్కడే ఉన్న ఓ మొబైల్ తీసుకొని... గాల్లోకి ఎగిరేసి మరి క్యాచ్ పట్టాడు బాలయ్య. దీంతో అక్కడ ఉన్న వాళ్ళతో పాటు హీరోయిన్ కూడా... పగలబడి నవ్వేసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.

ఇక అంతకుముందు ఇదే ఏలూరు జువెలరీ షాప్ లో... నందమూరి బాలయ్య ఆశీర్వాదం తీసుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్. ఆయన కాళ్లపై పడి.. ఆశీర్వాదం తీసుకుంది. దీంతో వెంటనే ఆమెకు ఆశీర్వాదం కూడా ఇచ్చారు నందమూరి బాలయ్య. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. అలా నందమూరి బాలయ్య మరోసారి సోషల్ మీడియాలో.. హల్ చల్ చేస్తున్నారు.

Next Story