సరిహద్దులో ఆపరేషన్ సిందూర్.. ఎస్ఎమ్‌లో బాలయ్య సినిమా వీడియో వైరల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-07 09:27:39  IST  )

భారత సరిహద్దులో ఉగ్రవాదుల హతం నేపథ్యంలో సోషల్ మీడియాలో హీరో బాలయ్య సినిమా వీడియో వైరల్ అవుతోంది...

సరిహద్దులో ఆపరేషన్ సిందూర్.. ఎస్ఎమ్‌లో బాలయ్య సినిమా వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: భారత సరిహద్దులో ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)తో ఉగ్రవాదులను(Terrorists) జవాన్లు(Jawans) మట్టుబెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకలు వినిపిస్తున్నారు. మన సైన్యంపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. పహల్గాం దాడికి గట్టిగా బదులిచ్చారంటూ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు. అయితే ఓ ట్వీట్ మాత్రం వైరల్ అయింది. నందమూరి బాలకృష్ణ(Nandmuri BalaKrihna) నటించిన ‘విజయేంద్ర వర్మ’ (Vijayendra Varma) సినిమాలోని ఓ వీడియోను ఘని అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆర్మీ ఆఫీసర్‌గా ఉన్న బాలయ్య.. ఉగ్రవాది(ముఖేష్ రుషి)ని హతం చేశారు. ఉగ్రవాదితో ఫైటింగ్ చేసి హెలికాప్టర్ నుంచి పాకిస్థాన్ ఏరియాలో పడవేస్తూ కాల్చి చంపి డెడ్ ‌బాడిపై జాతీయ జెండాను విసిరివేయడం.. అది రెపరెపలాడటం.. ఆ తర్వాత బాలయ్య సెల్యూట్ చేస్తారు. ఈ దృశ్యంతో కూడిన వీడియోను పోస్టు చేశారు. ‘యస్ వుయ్ విల్ ఎండ్’ అంటూ ట్వీట్ పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Next Story