- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మారెమ్మ’ నుంచి హీరో హీరోయిన్ లుక్ రిలీజ్.. చెరుకు చేను మధ్యలో ఆ పని చేస్తున్న ప్రేమికులు..
మాస్ మహారాజా రవితేజ(Raviteja) సొదరుడి కుమారుడు మాధవ్ భూపతి రాజు(Madhav Bhupathi Raju) నటిస్తున్న గ్రామీణ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’(Maremma).

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజా రవితేజ(Raviteja) సొదరుడి కుమారుడు మాధవ్ భూపతి రాజు(Madhav Bhupathi Raju) నటిస్తున్న గ్రామీణ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’(Maremma). మాచర్ల నాగరాజు(Macherla Nagaraju) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు(Mayur Reddy Bandaru) ఈ మూవీను నిర్మిస్తున్నారు. అయితే ఆ సంస్థలో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. ఇందులో మాధవ్ గుబురు గడ్డంతో, రగ్గడ్ లుక్‌లో, మాస్ స్టైల్‌తో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి న్యూ ఇయర్ స్పెషల్‌గా తాజాగా చిత్రబృదం హీరో హీరోయిన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అందులో చెరుకు చేను మధ్యలో హీరో వెనుక నుంచి షోల్డర్ పైన కర్ర వేసుకుని ముందు బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లంగావోణి కట్టుకొని హెయిర్ లీవ్ చేసుకున్న హీరోయిన్‌కు లైన్ వేస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ సిగ్గుపడుతోంది. ఫైనల్‌గా విలేజ్ థీమ్‌లో ఉన్న ఈ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.






