హైదరాబాద్‌ను వదిలేస్తున్న టాలీవుడ్ హీరో..?

by velandi.Saikiran |   (  Updated:2025-06-26 06:45:37  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పుష్ప ( Pushpa) సినిమాతో ఆయన క్రేజ్ ప్రపంచ స్థాయిక

హైదరాబాద్‌ను వదిలేస్తున్న టాలీవుడ్ హీరో..?
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పుష్ప ( Pushpa) సినిమాతో ఆయన క్రేజ్ ప్రపంచ స్థాయికి పెరిగిపోయింది. అంతేకాదు ఇటీవల... సీఎం రేవంత్ రెడ్డి (Cm revanth reddy) చేతుల మీదుగానే గద్దర్ అవార్డు అందుకొని... తన హీరో ఇజంను నిరూపించుకున్నాడు. అయితే అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు హైదరాబాద్‌ను (Hyderabad) వదిలివెళ్ళిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పర్మినెంట్‌గా హైదరాబాద్‌ను వదలడం లేదు కానీ... మూడు నెలలు మాత్రం ఇంటికి దూరంగా ఉండనున్నాడు. అది కూడా సినిమా షూటింగ్ కోసం కావడం గమనార్హం. హైదరాబాద్‌ను వదిలి ముంబైలో (Mumbai) మూడు నెలల పాటు అల్లు అర్జున్ ఉండబోతున్నారట. పుష్ప 2 బంపర్ హిట్ కావడంతో ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీగా ఈ సినిమా వస్తోంది. అయితే ఈ సినిమా షెడ్యూల్ ముంబైలోనే ప్రారంభించబోతున్నారట. అక్కడే దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు షూటింగ్ షెడ్యూల్ ఉంటుందని చెబుతున్నారు. అందుకే హైదరాబాద్‌ను వదిలి ముంబైలోనే మూడు నెలల పాటు అల్లు అర్జున్ ఉంటాడని సమాచారం అందుతుంది. తన ఫ్యామిలీని మొత్తం హైదరాబాదులోనే ఉంచి అల్లు అర్జున్ మాత్రం ఒంటరిగా వెళ్తారు.

Next Story