Actor Ajith : హీరో అజిత్ కు గాయాలు

by Muthe.Rajitha |

ప్రముఖ హీరో అజిత్(Actor Ajith) కు గాయాలు అయినట్టు సమాచారం.

Actor Ajith : హీరో అజిత్ కు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ హీరో అజిత్(Actor Ajith) కు గాయాలు అయినట్టు సమాచారం. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. అయితే మంగళవారం ఢిల్లీలో పద్మభూషణ్(Padmabhushan) పురస్కారం అందుకున్న అజిత్.. తిరిగి చెన్నై విమానాశ్రయానికి చేరుకోగా.. ఆ సమయంలో అభిమానులు ఒక్కసారిగా ఆయన వైపు దూసుకు రాగా.. తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో అజిత్ కాలికి స్వల్ప గాయం అయింది. దీంతో అజిత్ చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అజిత్ ఆసుపత్రి పాలైన విషయం తెలుసుకున్న సన్నిహితులు, అభిమానులు ఆందోళనకు గురికాగా.. అది స్వల్ప గాయమేనని, పెద్దగా ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. నేటి సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

Next Story