- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో అజిత్ కు ప్రమాదం
by Muthe.Rajitha |
తమిళ స్టార్ హీరో అజిత్(Actor Ajith)కు మరోసారి ప్రమాదం(Car Accident) జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ హీరో అజిత్(Actor Ajith)కు మరోసారి ప్రమాదం(Car Accident) జరిగింది. ప్రస్తుతం ఇటలీలోని మిసానోలో జరుగుతున్న GT4 యూరోపియన్ కార్ రేసింగ్ లో అజిత్ పాల్గొంటున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం జరిగిన కార్ రేసింగ్ 2 లో ట్రాక్ మధ్యలో ఆగి ఉన్న కారును, అజిత్ ప్రమాదవశాత్తూ తన కార్ తో ఢీకొట్టారు. అయితే ఈ ప్రమాదంలో అజిత్ కు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కాని ఈ పోటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాగా ఈ ఘటన అనంతరం అజిత్ ట్రాక్ క్లీనింగ్ లో వర్కర్లకు సహాయం చేయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో సూపర్ హిట్ సొంతం చేసుకున్న అజిత్, నెక్స్ట్ వేల్స్ ఇన్ పతాకంలో 'AK 64'లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 మేలో విడదల కానుంది.
Next Story






