- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aadi Sai Kumar: ఏ ఒక్కరినీ నిరాశపరచదు.. శంబాలపై హీరో కామెంట్స్
వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాల్ని పెంచేసిన సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాల్ని పెంచేసిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా మీడియా ముందుకు వచ్చారు టీమ్. ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ.. ‘మా టీజర్‌ను రిలీజ్ చేసిన దుల్కర్, మాకు సపోర్ట్ చేసిన థమన్, నా స్నేహితుడు సందీప్ కిషన్, ట్రైలర్ రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్‌కు థాంక్స్. మా ప్రమోషనల్ కంటెంట్‌కు అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది. మేం సినిమా మీద బజ్‌ను క్రియేట్ చేసే క్రమంలోనే ట్రైలర్‌ను ఇంత త్వరగా రిలీజ్ చేశాం. ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ అందరూ కూడా మా ట్రైలర్‌ను మెచ్చుకుంటున్నారు. హిందీ రిలీజ్ గురించి కూడా అందరూ అడుగుతున్నారు. మీడియా నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ లభిస్తోంది. మా నిర్మాతలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంతో వారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 25న మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నాం. కచ్చితంగా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్‌లకు వస్తున్నారు. ఇలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీని మీడియా, ఆడియెన్స్ ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.






