- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shanmukha: ఈ సినిమాతో నా కోరిక తీరింది.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆది సాయికుమార్ (Adi Saikumar) నటిస్తున్న లేటెస్ట్ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ (Devotional suspense thriller) మూవీ ‘షణ్ముఖ’

దిశ, సినిమా: ఆది సాయికుమార్ (Adi Saikumar) నటిస్తున్న లేటెస్ట్ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ (Devotional suspense thriller) మూవీ ‘షణ్ముఖ’ (Shanmukha). పవర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అవికాగోర్ (Avikagore) హీరోయిన్‌గా నటిస్తుండగా.. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తున్నాడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ మూవీని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం.
ఇందులో భాగంగా హీరోయిన్ అవికా గోర్ మాట్లాడుతూ.. ‘అందరిలాగే ఈ సినిమా కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా నాకు సపోర్ట్ చేసినందుకు అందరికి థ్యాంక్స్. డివోషనల్ ఫిలిం చేయడం హ్యపీగా ఉంది. ప్రతి ఆర్టిస్ట్ కోరుకునే డిఫరెంట్ రోల్ (Different role) నాకు ఈ చిత్రంలో లభించింది. ఐయామ్ వెరీ థ్యాంక్‌ఫుల్ (I am very grateful). అమేజింగ్.. క్లియర్ అమేజింగ్ కోయాక్టర్ ఆది. రవిబసూర్‌తో పనిచేయాలనే నాకోరిక ఈ సినిమా తీరింది’ అని చెప్పుకొచ్చింది.
హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ‘విడుదలకు ముందే ఈ సినిమా అన్ని డిజిటల్ హక్కులు (Digital rights), అన్ని భాషల శాటిలైట్ హక్కులు (Satellite rights), థియేట్రికల్ హక్కులు (Theatrical rights) ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోవడం ఆనందంగా ఉంది. నా సినిమా విడుదలై సంవత్సరం దాటిపోయిది. పైనల్‌గా మార్చి 21తో షణ్ముఖతో వస్తున్నాను. ఈ సినిమా క్రెడిట్ అంతా దర్శక, నిర్మాత షణ్ముగం సాప్పనికే దక్కుతుంది. ఈ సినిమా విషయంలో ఆయన చాలా కష్టపడ్డాడు. ఈసినిమా బిజినెస్ అయిపోవడం కూడా హ్యపీగా ఉంది. అవికాతో పనిచేయడం హ్యపీగా పీలయ్యాను. మళ్లీ మరో సారి ఆమెతో ఓ సినిమా చేయాలని ఉంది. తప్పకుండా మంచి సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. కాబట్టి ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు.






