- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హే బల్‌వంత్ : మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఇవే
హే బల్‌వంత్ మూవీకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.14 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్ : సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హే బల్‌వంత్ సినిమా నిన్న అనగా ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో, మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ కూడా లభించాయి. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయనేది తెలియజేస్తూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మొదటిరోజు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్గా 2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది.
ఈ మూవీకి మంచి టాక్ రావడం, మంచి ఓపెనింగ్స్ కూడా దక్కడంతో లాంగ్ రన్లో ఈ ఎంటర్టైనర్కు మంచి వసూళ్లు దక్కే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్, వెన్నెల కిషోర్, స్రవంతి చొక్కారపు, సుదర్శన్ తదితరులు నటించగా, గోపి అచ్చర దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్లో బి. నరేంద్ర రెడ్డి నిర్మించారు. షణ్ముఖ ప్రశాంత్ కథను అందించిన ఈ చిత్రానికి మిధున్ శంకర్ రెడ్డి మాటలు అందించారు.






