- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాస్ స్టెప్పులతో ‘హెల్లల్లల్లో’.. ప్రోమోతోనే ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై భారీ హైప్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ నుంచి స్పెషల్ సాంగ్ ‘హెల్లల్లల్లో’ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది రిలీజ్‌కు సిద్ధం అవుతున్న క్రమంలో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. రీసెంట్ ఈ బిగ్ ప్రాజెక్టు నుండి ట్రైలర్ రిలీజ్ కాగా.. సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇందులో ఐటెమ్ సాంగ్ ‘హెల్లల్లల్లో’ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఎప్పటి నుంచో పెద్ది స్పెషల్ సాంగ్‌లో మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్ స్టెప్పులు వేయబోతున్నట్లు వార్తలు రాగా.. వాటిని నిజం చేస్తూ రిలీజ్ చేసిన ప్రోమో నెట్టింట అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇందులో శృతి హాసన్, రామ్ చరణ్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కాగా.. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.






