- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాన్ ఇండియా హీరో మూవీలో హెబ్బాకు బంపర్ ఆఫర్ ?
నాని చేస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో హెబ్బా పటేల్ కు అవకాశం వచ్చిందట. ఈ మూవీలో ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ వేటలో

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయి, ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అలాంటి హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు. హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెరీర్లో అనేక రకాల డిఫరెంట్ కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఓదెల అనే విభిన్న కాన్సెప్ట్ సినిమాతో కూడా ఇరగదీసింది.
అయితే అలాంటి హెబ్బా పటేల్ కు తాజాగా ఓ బంపర్ ఆఫర్ తగిలినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. హీరో నాని చేస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో హెబ్బా పటేల్ కు అవకాశం వచ్చిందట. ఈ మూవీలో ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ వేటలో చిత్ర బృందం పడింది. మొదట తమన్నాను అనుకున్నారు. ఆ తర్వాత పూజా హెగ్డే పేరు పరిశీలనలోకి వచ్చింది. ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీలో ఐటెం సాంగ్ చేసేందుకు హెబ్బా పటేల్ అను సంప్రదించేందుకు చిత్ర బృందం సిద్ధమైందట. హెబ్బా పటేల్ ఈ ఆఫర్ కు ఓకే చెబితే అధికారిక ప్రకటన రానుందట.






