- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Odela-2 : ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్.. ఆడియన్స్‌కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: హెబ్బా పటేల్
తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటిస్తున్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’

దిశ, సినిమా: తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటిస్తున్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’ (Odela-2). ఇందులో హెబ్బా పటేల్ (Hebba Patel), వశిష్ట ఎన్ సింహ (Vasishtha N Simha) ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా రాబోతున్న ఈ మూవీని సంపత్ నంది సూపర్ విజన్‌లో డైరెక్టర్ అశోక్ తేజ తెరకెక్కిస్తున్నాడు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాల మద్య ఏప్రిల్ 17న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మేరకు ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోన్న చిత్ర బృందం.. తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ సినిమా విశేషాలు పంచుకుంది.
‘‘ఓదెల రైల్వే స్టేషన్’ లాక్ డౌన్ టైంలో చేసిన సినిమా. కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని సమయంలో సంపత్ నంది అండ్ టీం ధైర్యంగా ముందుకొచ్చి ఓదెల చేయడం జరిగింది. నిజానికి ఆ సమయంలో దీనికి సీక్వెల్ (sequel) అవుతుందని నేను అనుకోలేదు. సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది. మేము ఊహించిన దాని కంటే గొప్ప విజయం దక్కింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా బావుందని మెచ్చుకున్నారు. అయితే అప్పుడు కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఈ స్థాయిలో ఉంటుందని, ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ వస్తుందని నేను ఊహించలేదు (Not expected). కరోనా సమయంలో ఒక చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టిన ఓదెల ఘనవిజయాన్ని అందుకొని, ఇప్పుడు ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్‌గా ఓదెల 2ని ప్రేక్షకులకు ముందు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఓదెల1 అవుట్ అండ్ అవుట్ మర్డర్ మిస్టరీ (Murder Mystery). ఓదెల 2 సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓదెల కంటే ఓదెల2 మచ్ బిగ్గర్. చాలా అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్‌కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.






