Hebah Patel: బంజారా డ్రెస్‌లో దర్శనమిచ్చిన క్రేజీ బ్యూటీ.. హార్ట్ ఎమోజీ జోడిస్తూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-19 04:52:29  IST  )

‘కుమారి-21ఎఫ్’(Kumari 21F) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

Hebah Patel: బంజారా డ్రెస్‌లో దర్శనమిచ్చిన క్రేజీ బ్యూటీ.. హార్ట్ ఎమోజీ జోడిస్తూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కుమారి-21ఎఫ్’(Kumari 21F) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో ఈ భామదే మొయిన్ లీడ్ కావడం, సినిమా భారీ హిట్ అవ్వడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి మాత్రం రాలేదు. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బంజారా స్టైల్‌లో డ్రెసెప్ అయింది. ఇక ఈ పిక్స్‌కు ‘జీ అప్సర అవార్డ్స్ 2025 కోసం తిరిగి వేదికపైకి. స్టైల్ చేయబడింది’అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు హార్ట్ సింబల్ జోడిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story