నేను తమిళ్‌లో ఏ మూవీ చేసినా సపోర్ట్ చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చేది అతనే.. ఆ హీరో పై సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by I. Sairam |

స్టార్ హీరో కార్తీ(Karthi), యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) జంటగా నటిస్తున్న సినిమా ‘అన్నగారు వస్తారు’(Annagaru Vastharu).

నేను తమిళ్‌లో ఏ మూవీ చేసినా సపోర్ట్ చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చేది అతనే.. ఆ హీరో పై సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో కార్తీ(Karthi), యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) జంటగా నటిస్తున్న సినిమా ‘అన్నగారు వస్తారు’(Annagaru Vastharu). ఈ చిత్రానికి నలన్ కుమార స్వామి(Nalan Kumarasamy) దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 12న తెలుగులో రిలీజ్ కానుంది. దీంతో హైదరాబాద్‌లో అన్నగారు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఇక ఈ వేడుకకు డైరెక్టర్స్ బాబీ, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, దేవ కట్టా, వివేక్ ఆత్రేయ, రాహుల్ రవీంద్రన్, శైలేష్ కొలనుతో పాటు మధుర శ్రీధర్, హీరో సందీప్ కిషన్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘యంగ్ హీరోలు ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు చేయాలని కోరుకునే మూడు సినిమాల్లో తప్పకుండా ఒకటి కార్తీ అన్నది ఉంటుంది.

ఆయన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు.. నన్ను తమిళ్ ఆడియన్స్ ఇష్టపడరా అనే నమ్మకంతోనే కోలీవుడ్ వెళ్లాను. అక్కడ నాకు ప్రతిసారీ కార్తీ అన్న తన సపోర్ట్ అందిస్తుంటారు. ఆయన చేసిన అన్నగారు వస్తారు మూవీ మంచి హిట్ అవ్వాలి’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story