అతను ప్రతిరోజు నా దగ్గరకి వచ్చి అలా చేసేవాడు .. ఎప్పటికీ తనను వదులుకోను.. సమంత షాకింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది.

అతను ప్రతిరోజు నా దగ్గరకి వచ్చి అలా చేసేవాడు .. ఎప్పటికీ తనను వదులుకోను.. సమంత షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు.. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే మ్యారేజ్ అయిన 4సంవత్సరాలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక డివోర్స్ తర్వాత చైతన్య.. స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dulupala)తో డేటింగ్‌లో ఉంటూ డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నాడు.

కానీ, సమంత మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. అంతేకాకుండా మయోసైటీస్(Myositis) అనే మహమ్మారి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం నెట్టింట యాక్టీవ్‌గా ఉంటూ హెల్త్ టిప్స్ ఇస్తూ అభిమానులను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ మాట్లాడుతూ.. ‘చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) నాకు బెస్ట్ ఫ్రెండ్. మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటున్న టైంలో అతను ప్రతిరోజు నా దగ్గరకి వచ్చి ఎంతో ధైర్యం చెప్పేవాడు, అలాగే నాతో కొంత టైం స్పెండ్ చేసి జోక్స్ వేస్తూ నవ్వించే వాడు. చిన్మయి(chinmayi) కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్. జీవితంలో వారిని ఎప్పటికీ వదులుకోను’ అని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story