- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా సినిమా సమయంలోనే ఆయన ప్రశాంతంగా నిద్రపోయారు.. ఆ టెక్నీషియన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జే బాలాజీ
ఆర్జే బాలాజీ మాట్లాడుతూ… మా సినిమాకు జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. నా సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన ఎంతో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నానని స్వయంగా చెప్పారని ఆర్జే బాలాజీ చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆర్జే బాలాజీ తాజాగా సూర్య హీరోగా, త్రిష హీరోయిన్‌గా కరుప్పు చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీని మే 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో ఈ మూవీ దర్శకుడు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఆర్జే బాలాజీ మాట్లాడుతూ… మా సినిమాకు జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన జవాన్ మూవీకి కూడా వర్క్ చేశారు. అలాగే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న సినిమాకు పనిచేస్తున్నారు. ఏ దశలో కూడా ఆయనపై మేము ఎలాంటి ఒత్తిడి చేయలేదు. నా సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన ఎంతో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నానని స్వయంగా చెప్పారని ఆర్జే బాలాజీ చెప్పుకొచ్చాడు. ఇకపోతే కరుప్పు చిత్రాన్ని తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వరుస అపజయాలతో డీలా పడిపోయిన సూర్య ఈ మూవీతో మంచి విజయాన్ని అందుకొని తిరిగి కమ్‌బ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.






