సిగరేట్ మానేయకపోతే ముద్దు పెట్టనన్నాడు.. హీరో భార్య బోల్డ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

అప్పట్లో టాలీవుడ్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకున్న డిస్కో శాంతి(Disko Shanthi) మనందరికీ సుపరిచితమే.

సిగరేట్ మానేయకపోతే ముద్దు పెట్టనన్నాడు.. హీరో భార్య బోల్డ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో టాలీవుడ్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకున్న డిస్కో శాంతి(Disco Shanthi) మనందరికీ సుపరిచితమే. అప్పట్లో స్పెషల్ సాంగ్స్‌తో అలరించిన ఈ చిన్నది స్టార్ డమ్ తెచ్చుకుంది. అయితే ఈ భామ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే హీరో శ్రీహరి(Srihari)ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలా 80-90లలో అగ్రస్థానంలో ఉన్న ఆమె తర్వాత సినిమాలకు దూరమైంది. దీంతో ఈమె రీ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆమె ఫ్యాన్స్ ఈగర్‌గా చూస్తున్న క్రమంలో ఇప్పుడు దాదాపు 28 సంవత్సరాల తర్వాత పరిశ్రమలోకి తిరిగి వస్తోంది. డైరెక్టర్ ఇనాసి పాండియన్ దర్శకత్వం వహిస్తోన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ‘బుల్లెట్టు బండి’(Bullettu Bandi) చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుంది.

ఇందులో నటుడు రాఘవ లారెన్స్(Raghava Lawrence), అతడి సోదరుడు ఆల్విన్(Alwin) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక రీ ఎంట్రీ ఇస్తున్న క్రమంలో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డిస్కో శాంతిను యాంకర్ శ్రీహరి కోసం మీరు ఏమైనా వదిలేశారా అని అడగగా.. దానికి ఆమె స్పందిస్తూ.. “పెళ్లి కాకముందు నాకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. అయితే నువ్వు సిగరెట్ తాగితే నేను నీకు ముద్దు ఇవ్వను అని అన్నాడు. అందుకే పెళ్లికి ముందే నేను సిగరెట్ తాగడం మానేశాను.

ఆ తర్వాత పెళ్లికి ముందు నాకు షార్ట్ డ్రెస్సులు వేసుకునే అలవాటు. ఎయిర్ పోర్టుకు వెళ్లినా మినీ డ్రెస్సులోనే వెళ్లేదాన్ని.. ఎందుకంటే నాకు అప్పుడు తెలియదు.. ఆ ఏజ్ అలాంటిది కదా.. అయితే శ్రీహరి కూడా నన్ను 2 ఇయర్స్ వరకు ఈ డ్రెస్సులో చాలా బాగున్నావు అది ఇదని అనేవారు. కానీ పెళ్లి తర్వాత ఇక మనకే అని అనుకున్నాడో ఏమో నువ్వు షార్ట్ డ్రెస్సులు వేసుకోవద్దని తెగేసి చెప్పాడు. దీంతో నేను పొట్టి బట్టలు వేసుకోవడం మానేశాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story