- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss 18: బిగ్ బాస్ 18 విన్నర్ అతనే.. ప్రైజ్ మనీ ఎంత గెల్చుకున్నాడంటే?
ఆడియెన్స్ ఓట్ల ఆధారంగా విజేతను ప్రకటించారు

దిశ, వెబ్ డెస్క్ : హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 18వ సీజన్ ( Bigg Boss 18 ) విజేతగా కరణ్ వీర్ మెహ్రా ( Karan Veer Mehra ) నిలిచారు. ఆడియెన్స్ ఓట్ల ఆధారంగా విజేతను ప్రకటించారు. 46 ఏళ్ల కరణ్ వీర్ మెహ్రా ఈ షో ద్వారా రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. మొదటి రన్నరప్‌గా వివియన్ ద్సేనా ఉండగా, రెండవ రన్నరప్‌గా యూట్యూబర్ రజత్ దలాల్ నిలిచారు.
ఈ షో లో అతను గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ ఫైనల్ గా బిగ్ బాస్ కప్పుతో ఇంటికి వెళ్ళాడు. కరణ్ ఫ్యాన్స్ , బుల్లి తేరా ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. బిగ్ బాస్ షోకు ముందు కరణ్ పవిత్ర రిష్తా, యే రిష్తా క్యా కెహ్లతా హై, పరి హూన్ మైన్, బడే అచ్ఛే లాగ్తే హాన్, ససురల్ సిమర్ కా, పోలీస్ & క్రైమ్, వంటి టీవీ షోలతో బాగానే పాపులర్ అయ్యాడు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. 2005లో రీమిక్స్ షోతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. సోనీ SAB TV, బివి ఔర్ మెయిన్‌లో కీ రోల్ పోషించాడు. బ్లడ్ మనీ , రాగిణి MMS 2 , మేరే డాడ్ కి మారుతి , బద్మషియాన్, ఆమెన్ వంటి బాలీవుడ్ సినిమాలో కూడా మెరిశాడు.
- Tags
- Bigg Boss 18






