- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'బ్రహ్మోత్సవం' ఫ్లాప్‌కు అసలు కారణం అతనే.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
దర్శకుడి నిర్లక్ష్యం వల్లే ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఫ్లాప్ అయిందని ఆ చిత్ర నిర్మాత పొట్లూరి వీరప్రసాద్ చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించక ఫ్లాప్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను నిర్మాత పొట్లూరి వీరప్రసాద్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. “‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు నేను మెయిల్ చేశాను.
స్క్రిప్ట్ వర్క్ పూర్తికాకుండా షూటింగ్ ప్రారంభించొద్దని చెప్పాను. అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ డబ్బులతో మనం సినిమా చేస్తున్నాం. ఇలా చేస్తే వారికి న్యాయం జరగదని కూడా స్పష్టం చేశాను. బ్రహ్మోత్సవం మంచి కథే. కానీ దర్శకుడు సినిమా ప్రారంభానికి ముందే పూర్తి కథను సిద్ధం చేయలేదు. దర్శకుడి నిర్లక్ష్యం, క్రమశిక్షణ లేకపోవడం వల్లే సినిమా దెబ్బతింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద సమస్యల్లో నిర్లక్ష్యం, డిసిప్లిన్ లేకపోవడం కూడా ఒకటి అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పొట్లూరి వీరప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.






