- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన ఒక్కరే నన్ను నమ్మారు.. తన నెక్ట్స్ సినిమా అప్డేట్ ఇస్తూ ప్రభాస్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) తెలుగు, హిందీలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) తెలుగు, హిందీలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక గత ఏడాది ఈ అమ్మడు ఏకంగా మూడు చిత్రాల్లో నటించింది. చివరిగా ‘దో పత్తి’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం కృతి సనన్ వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది. ఓ మూడు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా, కృతి సనన్ మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను మ్యాడాక్‌తో 7 సినిమాలు చేశాను. అయితే ఇప్పుడు నా 8వ ప్రాజెక్ట్ కూడా ఈ బ్యానర్‌లో చేయబోతున్నాను.
అయితే దినేష్ విజయన్(Dinesh Vijayan) గారు నన్ను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ఎవరూ నన్ను నమ్మనప్పుడు ఆయన నాపై నమ్మకంగా ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది కృతిని ఎందుకు తీసుకున్నారు అని అడిగినప్పటికీ ఆయన నాకు అవకాశం ఇవ్వడం నా అదృష్టం. నేను నటించబోతున్న కాక్‌టేల్-2 (Cocktail 2)మూవీ షూటింగ్ సమ్మర్‌లో స్టార్ట్ కాబోతుంది.’’ అని చెప్పుకొచ్చింది. అయితే హోమి అడజనియా(Homi Adajania) దర్శకత్వంలో రాబోతున్న ‘కాక్‌టేల్-2’ చిత్రంలో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమా దీపికా పదుకొణె నటించిన ‘కాక్‌టేల్’కు సీక్వెల్‌గా తెరకెక్కునుంది. ఇందులో టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన్న, అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇక ఇందులో కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






