‘Pushpa’ చిత్రంలో అల్లు అర్జున్ పాత్రకు హిందీతో డబ్బింగ్ చెప్పింది ఇతడే..?

by Kodari Anjali |   (  Updated:2024-12-08 05:42:59  IST  )

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప రెండు భాగాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

‘Pushpa’ చిత్రంలో అల్లు అర్జున్ పాత్రకు హిందీతో డబ్బింగ్ చెప్పింది ఇతడే..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్(Director Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప(Pushpa) రెండు భాగాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. మొత్తానికి చిత్ర యూనిట్ కష్టానికి ప్రతిఫలం దక్కిందని చెప్పుకోవచ్చు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika మందన్న national crush) నటించిన ఈ చిత్రం రెండ్రోజుల్లోనే ఏకంగా వరల్డ్ వైడ్‌గా రూ. 500 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. రికార్డు క్రియేట్ చేసింది. అయితే పుష్ప రెండు పార్ట్స్‌లోనూ హిందీలో హీరో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ రోల్‌కు శ్రేయాస్ తల్పాడే(Shreyas Talpade) డబ్బింగ్ చెప్పారట. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నా వాయిస్ పుష్ప మూవీకి తోడైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

అల్లు అర్జున్ బాడీకి తగ్గట్లు నా వాయిస్ ఉండాలంటే చాలా గంభీరంగా చెప్పాలి. అయితే పుష్పరాజ్(Pushparaj) స్మోక్(Smoke), గుట్కా(Gutka), డ్రింక్ చేస్తున్నప్పుడు డబ్బింగ్ చెప్పడం కాస్త కష్టంగా అనిపించిందని వెల్లడించారు. ఈ సన్నివేశాలకు నోట్లో కాటన్ పెట్టుకుని వాయిస్ చెప్పానని పేర్కొన్నారు. ప్రజెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప సినిమాలో బన్నీ పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్ తల్పాడే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పుష్ప-2 కూడా హిట్ కొట్టడంతో ప్రస్తుతం చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా సంతోషాన్ని తెలియజేస్తున్నారు. ఫస్ట్ డే నే ఏకంగా రూ. 72 కోట్లు వసూళ్లు కొల్లగొట్టిందంటే మామూలు విషయం కాదు. ఇక తాజాగా రూ. 500 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ అఫీషియల్‌గా వెల్లడించింది.

Next Story