టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ అతనే.. అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Pulgam srinivas |

నా దృష్టిలో రామ్ చరణ్‌నే బెస్ట్ డాన్సర్ అని అఖిల్ చెప్పుకొచ్చాడు.

టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ అతనే.. అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అఖిల్ అక్కినేని తాజాగా 'లెనిన్' సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జూలై 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగా హీరో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ ఇటీవల సుమ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో అఖిల్‌కు "తెలుగు సినిమా పరిశ్రమలో బెస్ట్ డాన్సర్ ఎవరు?" అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి ఆయన ఏమాత్రం ఆలోచించకుండా "రామ్ చరణ్" అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత "రామ్ చరణ్ అంటే మీకు చాలా ఇష్టమా?" అని ప్రశ్నించగా, అఖిల్ ఆసక్తికరంగా స్పందిస్తూ "ఇష్టం కాదు... లవ్" అని చెప్పాడు. దీంతో రామ్ చరణ్‌పై అఖిల్‌కు ఉన్న అభిమానం ఎంత ప్రత్యేకమైందో ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక 'లెనిన్' చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నాగ వంశీ, నాగార్జున సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

Next Story