నీట్ రీఎగ్జామ్.. అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన CJP వ్యవస్థాపకులు

by Ajay Maddhiboyina |

నేడు దేశ‌వ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్ నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు అభిజిత్ దిప్కే అభ్య‌ర్థుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. పరీక్ష ముందు ధ‌ర్నాకు రావాల‌ని పిల‌వ‌డంలేద‌ని బాగా చ‌దుకోవాల‌ని అన్నారు.

నీట్ రీఎగ్జామ్.. అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన CJP వ్యవస్థాపకులు
X

దిశ, వెబ్ డెస్క్: నేడు దేశ‌వ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్ నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు అభిజిత్ దిప్కే అభ్య‌ర్థుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. పరీక్ష ముందు ధ‌ర్నాకు రావాల‌ని పిల‌వ‌డంలేద‌ని బాగా చ‌దుకోవాల‌ని అన్నారు. ప‌రీక్ష రాసిన అనంత‌రం అభ్య‌ర్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వ‌ద్ద త‌మ‌ను క‌ల‌వాల‌ని కోరారు. మిమ్మ‌ల్ని క‌లిసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామ‌ని తెలిపారు. ఇక ప్ర‌స్తుతం కాక్రోచ్ జ‌న‌తా పార్టీ అధ్వ‌ర్యంలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీకేజీకి బాధ్య‌త వ‌హిస్తూ కేంద్రమంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ డిమాండ్ చేస్తోంది. శ‌నివారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర‌వాత కూడా ఈ నిర‌స‌న కొన‌సాగుతూనే ఉంది. దేశంలో విద్యావ్య‌వ‌స్థ‌లో, ఉద్యోగ నియామ‌కాల్లో జ‌రుగుతున్న లీకేజీల‌పై విచార‌ణ జ‌రిపి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అభిజిత్ దీప్కే నేతృత్వంలో జ‌రిగిన ఈ నిర‌స‌న‌లో వంద‌లాది మంది విద్యార్థులు, కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Next Story