- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతనే నా గురువు.. మెగా హీరోపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది.. ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇక అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడి అతన్నే మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత రీసెంట్‌గా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో పెళ్లిపీటలెక్కింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది.
ఇక మ్యారేజ్ తర్వాత మళ్లీ తమ ప్రొఫెషనల్ వర్క్స్‌లో బిజీ అయిపోయింది సమంత. ‘శుభం’(Shubham) సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న సామ్ ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు కూడా సామ్‌నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. సమంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి అత్తారింటికి దారేది సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ప్రణీత సుభాష్ కూడా యాక్ట్ చేసింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత పవన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
ఆ ఫొటోలో సమంతను పవన్ ఆశీర్వదిస్తూ కనిపించారు. దీని గురించి సమంత మాట్లాడుతూ.. ‘పవన్ నా గురువుగారు. స్విట్జర్లాండ్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సరదాగా తీసిన ఫొటో అది. పవన్ కళ్యాణ్ నటుడు కాకపోయి ఉంటే నాకు గురువుగా ఉండమని కోరే దాన్ని. ఈ చిత్రంలో పవన్‌తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే పవన్ ఎవరినైనా తిట్టాలంటే కూడా చాలా మర్యాదగా తిట్టే వారు’ అంటూ సమంత చెప్పుకొచ్చింది. గతంలో సామ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






