- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలాంటి ఎంతోమందికి ఆయనే స్ఫూర్తి.. చాలా ఇబ్బంది పెట్టానంటూ స్టేజ్‌పై కన్నీరు పెట్టుకున్న శింబు (వీడియో)
కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu), కమల్ హాసన్(Kamal Haasan) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’(Thuglife).

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu), కమల్ హాసన్(Kamal Haasan) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’(Thuglife). మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 5న థియేటర్స్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ ఆడియో లాంచ్ నిర్వహించారు. ఇక ఇందులో పాల్గొన్న శింబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘‘ఏఆర్ రెహమాన్‌ను నేను చాలా ఇబ్బంది పెట్టాను ఇప్పటికీ పెడుతూనే ఉన్నా. నేను పాడిన ఓ పాట వివాస్పదమైంది. అది నా జీవితంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నా. అప్పుడు ఆయనే పనులన్నీ మానేసి నాతో వర్క్ చేశారు. ఇటీవల నాకు రెడ్‌కార్డ్ జారీ అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అది చూసిన నిర్మాతలు నాకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వలేదు.
చాలా కష్టంగా అనిపించింది. ఈ సమయంలో నన్ను నమ్మి మణిరత్నం నాకు చాన్స్ ఇచ్చారు. ఎప్పటికీ ఆయనే నా గురువు. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలోఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. అప్పుడు నా ఫ్యామిలీ అండగా నిలిచింది. నటుడిగా స్ఫూర్తి నింపింది మాత్రం కమల్ హాసన్ గారే. ఆయన సినిమాలు చూసి పెరిగాను. నటుడిగా మలిచివ్యక్తి ఆయనే. నాలాంటి ఎంతోమంది స్ఫూర్తి. కమల్ హాసన్‌ను ఎవరూ రిప్లేస్ చేయలేరు. ఆయన ఒక గొప్ప నటుడు’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే స్టేజ్‌పై మాట్లాడుతూ శింబు కన్నీరు పెట్టుకున్నారు. కాసేపటి తర్వాత బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని కవర్ చేశారు. ఇక అది చూసిన నెటిజన్లు అంతా ఆశ్చర్యపోతున్నారు.






